తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఈసారి లీటర్ పెట్రోల్ పై 40 పైసలు

  • వరుసగా 11వ రోజు తగ్గిన ధరలు
  • లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసల తగ్గింపు
  • హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11వ రోజు కూడా తగ్గాయి. గత 10 రోజులతో పోలిస్తే ఈ రోజు ధరలు ఎక్కువగా  తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసలను తగ్గించినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.

దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59కి, డీజిల్ ధర రూ.74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84కి, డీజిల్ ధర రూ. 75.20కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.02, ముంబైలో రూ. 84.84, కోల్ కతాలో రూ. 79.68గా ఉంది.
Go Back to Shorts
petrol
diesel

More Telugu News